టీమిండియా కెప్టెన్సీ విభజన వాదనలో అర్థం లేదన్నారు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. కెప్టెన్…. ఆ కెప్టెన్సీని భారం ఫీలవనంత వరకూ ఆ భాధ్యతల్లో కొనసాగాలని తన ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు లక్ష్మణ్.
విరాట్ ప్రస్తుతం కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు…. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌గా కోహ్లీ ఆడినన్ని రోజులు కెప్టెన్‌గా కొనసాగాలన్నాడు. ఇంగ్లాండ్ టీమ్‌లో కెప్టెన్సీ విభజన మెరుగైన ఫలితాల్ని ఇచ్చింది…. దానికి కారణం.. జో రూట్ వన్డే, టీ20ల్లో ఆడటం లేదు.. అలానే ఇయాన్ మోర్గాన్.. టెస్టు టీమ్‌లో లేడు. అలా కాకుండా.. ఒక కెప్టెన్ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ.. ప్లేయర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పుడు.. అతను కెప్టెన్‌గా కొనసాగడమే మేలు. కాబట్టి.. భారత్ జట్టు కెప్టెన్సీ విభజనపై చర్చలో అర్థం లేదు. కెప్టెన్సీ విభజన భారత్ క్రికెట్‌కి నప్పదు అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.