నెట్టింట్లో వినయ విధేయ రామ హల్ చల్

292
vinaya videya rama
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం వినయ విధేయ రామ. లవ్‌ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇవాళ(డిసెంబర్‌ 27)న హైదరాబాద్‌లో జరగనుంది. సాయంత్రం యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుండగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,యంగ్‌ టైగర్ ఎన్టీఆర్,ప్రభాస్‌,రానా అతిథులుగా రాబోతున్నారు. ఇదే వేదికపై థియేట్రికల్‌ ట్రైలర్‌ని కూడా విడుదల చేయనుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చరణ్ గుర్రంపై ఉన్న స్టిల్ రిలీజ్ చెయ్యగా, ఆ లుక్‌ ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది. ఒకే ఒక్క లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు చెర్రీ. 2019 జనవరి 11న రానున్న విడుదల కానున్న ఈ మూవీతో చెర్రీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -