పెదకాపు1.. విజయం సాధించాలి: వినాయక్

9
- Advertisement -

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన తాజా చిత్రం ‘పెదకాపు-1’ ప్రధాన పాత్రలో యంగ్ స్టర్ విరాట్ కర్ణను నటింపజేయాలని ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సాధారణ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కాదు. పెదకాపు-1 న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి.. ఇది యంగ్ స్టర్ కి కూడా సవాల్. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ట్రైలర్ లాంచ్ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.

సమాజంలో సామాజిక న్యాయం లేకపోవడం వలన విప్లవాలు పుట్టుకొస్తాయి. పెదకాపు-1 ఉన్నత వర్గానికి చెందిన ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో కుల అణచివేతను ప్రజంట్ చేస్తోంది. ట్రైలర్‌లో సినిమా కథాంశాన్ని వెల్లడించే అంశాలు చాలా ఉన్నాయి. సంక్షోభం ఏర్పడినప్పుడు అది విప్లవానికి దారి తీస్తుంది, అణచివేతదారులకు వ్యతిరేకంగా ఒక సామాన్యుడు తన స్వరాన్ని వినిపించి, వారిపై హింసాత్మక యుద్ధాన్ని కూడా మొదలుపెడతాడు.ట్రైలర్‌లో విరాట్ కర్ణ అద్భుతంగా కనిపించారు. ఫెరోషియస్ గా కనిపించిన విరాట్ సినిమాలో ఎక్స్ టార్డినరీ పెర్ ఫార్మెన్స్ కనబరిచాడని స్పష్టంగా తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల బ్రిలియంట్ వర్క్ చేశారు. ట్రైలర్ లో డైలాగ్స్ ఆలోచింపజేసేలా వున్నాయి. ట్రైలర్‌లో దాదాపు ప్రతి సీక్వెన్స్‌లోనూ అదే ఇంటెన్సిటీ ఉంది. దాదాపు 2.5 నిమిషాల నిడివి గల వీడియో వైలెన్స్ తో నిండి ఉంది. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్ గా వున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ప్రధాన విలన్స్ లో ఒకరిగా నటించడం ఆసక్తికరంగా వుంది. తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. విరాట్ సరసన ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటించింది.

Also Read:Allu Arjun:పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్

ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందించారు. కథనాన్ని నేచురల్ గా, స్ట్రాంగ్ గా చేయడానికి డార్క్ థీమ్‌ను ఎంచుకున్నారు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌కు మరింత బలం చేకూర్చారు. ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

Also Read:సూపర్‌స్టార్ మహేష్… ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’

- Advertisement -