నేను శైలజ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన యంగ్ హీరో రామ్. తర్వాత వచ్చిన హైపర్తో తడబడ్డ తన కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. స్రవంతి రవికిశోర్ సమర్పణలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన అనుమపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటించారు.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నేను శైలజ హిట్ కావడంతో మరోసారి రామ్.. కిశోర్‌పై నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ వసూళ్ల పరంగా బాగానే దూసుకుపోతుంది. తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.63 కోట్లు వసూలు చేసింది.
ఇక మొదటి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 9.13 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 10.93 కోట్ల షేర్ ను వసూలు చేసింది. స్నేహం .. ప్రేమ నేపథ్యంలో రూపొందడం వలన ఈ కథాంశం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అందువలన వసూళ్ల పరంగా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోందని అంటున్నారు. రామ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ సెట్ అయిన తీరు చూస్తే, ఆయన తదుపరి సినిమాల్లోను ఆమె ఛాన్స్ కొట్టేయడం ఖాయమని చెబుతున్నారు.