త్వరలో #VT15 ఫస్ట్ లుక్

8
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది.

ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే వెరీ స్పెషల్, ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హారర్‌–కామెడీ, ఇండియన్ & కొరియన్ బ్యాక్డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి, గ్రాండ్ విజువల్స్‌ని క్యాప్చర్ చేశారు. షూటింగ్ చాలా స్పీడ్‌గా కంప్లీషన్ దిశగా వెళ్తోంది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కంపోజింగ్ సెషన్స్ శర వేగంగా జరుగుతున్నాయి. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ – థమన్ కాంబో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ ఇవ్వబోతోంది. ఇందులో ఇప్పటికే రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ షూట్ అయ్యాయి. ఇవి సినిమాకే హైలైట్స్ కానున్నాయి. త్వరలోనే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేయనున్నారు.

తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య
రచన, దర్శకత్వం : మేర్లపాక గాంధీ
నిర్మాతలు: UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: ఎస్ థమన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్టాగ్ మీడియా

Also  Read:BRS:స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

- Advertisement -