విఎస్‌ఎల్‌- సిహెచ్‌ఎస్ఎస్‌ల‌ మధ్య అవగాహన ఒప్పందం..

119
VSL MoU between CHSS
- Advertisement -

వి.ఐ.టి-ఎ.పి స్కూల్ ఆఫ్ లా (VSL), వి.ఐ.టి-ఎ.పి విశ్వవిద్యాలయం మరియు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (CHSS)ల మధ్య అవగాహనా ఒప్పందం (MoU) సంతకం కార్యక్రమం వి.ఐ.టి-ఎ.పి. విశ్వ విద్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్. ద్వారకా తిరుమలరావు ఐపిఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రైల్వే) (ఆంధ్రప్రదేశ్ కేడర్) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ముఖ్య అతిథి సిహెచ్. ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ “ఈ రోజు విఐటి-ఎపి స్కూల్ ఆఫ్ లా (VSL),విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (CHSS) మధ్య చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలుస్తుందని తెలియచేశారు. ఈ రెండు సంస్థలు దేశ భద్రతకై కట్టుబడి, ఉమ్మడి విలువలను, ఆలోచనలను పరస్పరం పంచుకొని దేశ భద్రతలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవటానికి తమ వంతు కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలియచేశారు.

ఈ రోజు మనం సైబర్ భద్రత, ఆరోగ్య భద్రత, తీర ప్రాంత భద్రత మరియు ఎక్కువగా అంతర్గత భద్రతలలో పెరుగుతున్న ముప్పును చూస్తున్నాము. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే స్పష్టమైన విధానం మరియు చట్టపరమైన అంశాలతో వ్యవహరించాలి. స్పష్టమైన విధానం మరియు చట్టపరమైన మార్గదర్శకాలు లేకుండా ముప్పు నుండి దేశ ప్రజలకు రక్షణ కల్పించడం కష్టం. ఈ సవాళ్లను స్పష్టంగా మరియు కేంద్రీకృత పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని వి.ఐ.టి-ఎ.పి విశ్వవిద్యాలయం మరియు సిహెచ్‌ఎస్‌ఎస్ లకు సూచించారు.

వి.ఐ.టి-ఎ.పి విశ్వవిద్యాలయం ఈ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థలలో ఒకటి, పెరుగుతున్న భద్రతా ముప్పు కారణంగా ఎదురయ్యే వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో విధాన మరియు చట్ట రూపకర్తలకు మార్గనిర్దేశం చేయగల సామర్థ్యం ఉందని ప్రశంసించారు. పెరుగుతున్న భద్రతా సవాళ్ళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలలో అవగాహన కల్పించడానికి వివిధ కార్యకలాపాలను నిర్వహించడంలో CHSS దాదాపు 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉంది.

వి.ఐ.టి-ఎ.పి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా. ఎస్. వి. కోటా రెడ్డి మాట్లాడుతూ.. విద్య యొక్క సాధికారత మరియు ప్రోత్సాహానికి విశ్వవిద్యాలయం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని న్యాయ విద్యార్థులు మరియు అధ్యాపకులకు సూచించారు. సైబర్ సెక్యూరిటీ అండ్ లా విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయటానికి విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని తెలిపారు. సమాజానికి మెరుగైన పరిష్కారాలను అందించడానికి ఈ కేంద్రం సమగ్రంగా పని చేస్తుంది ఆయన తెలియజేశారు.

వి.ఐ.టి-ఎ.పి. స్కూల్ ఆఫ్ లా (VSL), వి.ఐ.టి-ఎ.పి యూనివర్శిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందుకు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (CHSS) వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా|| రమేష్ బాబు కన్నెగంటి అందరికి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ శిక్షణా కార్యక్రమాలు మరియు విద్యా మరియు పరిశోధన కార్యకలాపాలలో రెండు సంస్థల కలిసి పనిచేస్తాయని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వి.ఐ.టి-ఎ.పి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా|| సిఎల్వి శివకుమార్ మరియు డీన్ వి.ఐ.టి-ఎపి స్కూల్ ఆఫ్ లా, డా|| బెనార్జీ చక్కా, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -