రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ టూర్ సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా తాజాగా బెయిన్ క్యాపిటల్ గ్రూప్‌నకు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ సుముఖత వ్యక్తం చేసింది.
మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్‌కింగ్ ఈ మేరకు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో సేవలు అందిస్తోంది.
Also Read:TTD:తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
అదేవిధంగా రాష్ట్రంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మండీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. హూస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో మండి హోల్డింగ్స్ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ప్రసాద్ గుండుమోగుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చారు. దీనిద్వారా 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
Also Read: ఇవి పాటిస్తే మీ ఆరోగ్యం పదిలం