మినిస్టర్స్ క్వార్టర్స్‌.. వీఆర్‌ఏల ఆందోళన

0
- Advertisement -

మినిస్టర్ క్యార్టర్స్ వద్ద ఆందోళన చేస్తున్న మహిళా వీఆర్ఏలపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. నా ప్రాణం బాగాలేదు.. కాళ్ళు మొక్కుత వదిలేయండి మేడం అన్నా కూడా వదలలేదు పోలీసులు.

మా వీఆర్ఏలకు రేవంత్ రెడ్డి, సీతక్క, తీన్మార్ మల్లన ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.. కానీ ఇవాళ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. 80 రోజులు సమ్మె చేసి తెచ్చుకున్న G.O ఇంప్లిమెంట్ అవ్వడానికి మేము మళ్లీ కొట్లాడవలసి వస్తుందన్నారు.

మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తే మీకు ఉద్యోగాలు రావని అయినా నేను వినకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాడి గెలిపిస్తే.. మా వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -