రాష్ట్ర వ్యాప్తంగా జనం ఏపార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుస్తుందా అని ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కానీ గ్రేటర్‌లో మాత్రం జనం ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మంగళవారం జరుగుతున్న గ్రేటర్ పోలింగ్‌లో నిదానంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.22 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్ల వారీగా చూస్తే అత్యధికంగా గుడిమల్కాపూర్ లో 49.19 శాతం ఓటింగ్ జరిగింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అత్యల్పంగా రెయిన్ బజార్ డివిజన్ లో 0.56 శాతం పోలింగ్ నమోదైంది. తలాబ్ చంచలం డివిజన్ లో కేవలం 0.74 శాతం పోలింగ్ జరిగినట్టు తెలిసింది.
గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మి, బెల్లంకొండ శ్రీనివాస్, విజయ్ దేవరకొండ ఫామిలీ తదితరులు తమ ఓటు వేశారు. కాగా, మధ్యాహ్నానికి కనీసం 20 శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.