2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు బారులు తీరారు. మంత్రి హరీష్,తుమ్మల,పోచారం,జగదీష్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
ప్రముఖులు వారు ఓటేసే ప్రాంతం..
సీఎం కేసీఆర్ – చింతమడక
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్-రాజ్‌నగర్
మహమూద్‌అలీ -అజంపురలోని కిడ్జ్ ప్లేపాఠశాల
కడియం శ్రీహరి -హన్మకొండ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ ఫేజ్-1 ప్రగతిమిత్ర కమ్యూనిటీ హాలు
స్పీకర్ మధుసూధనాచారి – పరకాలలోని నర్సక్కపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ – రాజేంద్రనగర్.. కిస్మత్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రం
కేటీఆర్ – ఖైరతాబాద్ లోని సెయింట్ నిజామిస్ ఉన్నత పాఠశాల
కల్వకుంట్ల కవిత – బోధన్‌లోని పొతంగల్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి – కోదాడ
జానారెడ్డి – నాగార్జున సాగర్
జైపాల్‌రెడ్డి – జూబ్లీహిల్స్ క్లబ్ హైదరాబాద్
రేవంత్‌రెడ్డి – కొండారెడ్డిపల్లి, అచ్చంపేట సెగ్మెంట్
పొన్నం ప్రభాకర్ – కరీంనగర్
మల్లు భట్టివిక్రమార్క – మధిర
దామోదర రాజనర్సింహ – జోగిపేట
సీపీఐ సురవరం సుధాకర్‌రెడ్డి – శేరిలింగంపల్లిలోని ఖాజాగూడా కేంద్రం
సీపీఐ చాడ వెంకట్‌రెడ్డి – హుస్నాబాద్ లోని చిగురుమామిడి మండలం రేగొండ కేంద్రం
సీపీఎం తమ్మినేని వీరభద్రం – అంబర్‌పేటలోని ఇంద్రప్రస్థ కాలనీ కమిటీ హాలు
కోదండరామ్ – తార్నాక సంక్షేమ సంఘం పోలింగ్ కేంద్రం
బీజేపీ లక్ష్మణ్ – ముషీరాబాద్ లోని శాంతినికేతన్ గ్రౌండ్స్‌లోని కేంద్రం
బండారు దత్తాత్రేయ – ముషీరాబాద్ లోని రాంనగర్ జేవీ ఉన్నత పాఠశాల
కిషన్‌రెడ్డి – లింగంపల్లిలోని దీక్ష మోడల్ పాఠశాల