ఈవీఎంల పనితీరుపై ఎలాంటి అనుమానం వద్దని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. న్యాయస్ధానాల్లో 37 కేసులు వేసినా ఈవీఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని తెలిపారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదా జాబిత సవరణ చేపట్టి అభ్యంతరాలను పరిష్కరిస్తామని చెప్పారు. పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే నగదుపై నిఘా పెడుతామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ నెల 15, 16వ తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు. ఓటర్లను చైతన్య పర్చేందుకు తమ యంత్రాంగం చర్యలు చేపట్టిందని …ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 20లోగా కావాల్సినన్నీ ఈవీఎంలు రాష్ర్టానికి వస్తాయని వెల్లడించారు. రాజకీయ పార్టీల సమక్షంలో వాటిని సమీక్షిస్తామని ఈ సారి కొత్తగా వీవీ ప్యాట్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై వచ్చే కథనాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.