నేటి నుండి ఓటర్‌ స్లిప్పుల పంపిణీ…

385
voter slips
- Advertisement -

హైదరాబాద్ జిల్లా పరిధిలో నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ చేపడుతున్నట్లు ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. బూత్ లెవల్ అధికారులు ఆయా బూత్‌ల వారీగా ఈ చిట్టీల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతారని ఆయన చెప్పారు.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నోడల్ అధికారులతో రివ్యూ నిర్వహించిన దానకిశోర్ జిల్లాల్లో 3866 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున మోబైల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో టాయిలెట్లు,నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Image result for voter slips

18 వేలమంది దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వరకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓటు వేయాల్సినవారు వాదా యాప్ ద్వారా తాము ఓటు వేసే సమయం తెలియజేస్తే ఆ సమయానికి వాహనం వస్తుందని చెప్పారు.

- Advertisement -