KTR:వినోద్‌తోనే కరీంనగర్ అభివృద్ధి..

27
- Advertisement -

కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిచి తీరాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…తెలంగాణ ఉద్యమంలో వినోద్‌కుమార్‌ చురుకైన పాత్ర పోషించారని కేటీఆర్‌ కొనియాడారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరని పేర్కొన్నారు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ కుమార్‌ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. వినోద్‌ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Also Read:5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..మరో 2 పెండింగ్!

- Advertisement -