నేను టీఆర్ఎస్ వెంటే- నటుడు ప్రకాష్‌ రాజ్‌

230
Actor Prakash raj
- Advertisement -

ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో న‌గ‌ర ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. ప్రకాష్‌ రాజ్‌ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ… విభ‌జ‌న రాజ‌కీయాలు చేసే పార్టీల‌కు కాకుండా సామ‌ర‌స్యం కోసం ప‌నిచేసే పార్టీకి ద‌య‌చేసి అండ‌గా ఉండాల్సిందిగా హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆయ‌న‌ ట్విట్టర్‌ ద్వారా కోరారు. అంతేకాదు తాను కూడా టీఆర్ఎస్ వెంటేన‌న్నారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, టీఆర్ఎస్‌తో నిల‌బ‌డ‌తాన‌ని నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్ చేశారు.

- Advertisement -