ఓటు హక్కు వినియోగించుకోండి:కేటీఆర్

238
ktr
- Advertisement -

రానున్న ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మన హైదరాబాద్-మన అందరి హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్…హైదరాబాద్ పౌరుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.

ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును దాటడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. టీ హబ్‌తో అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షించామని వెల్లడించారు.ఆపిల్, గూగుల్, ఫేస్ అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వచ్చాయని తెలిపారు.

ktr mallareddy college

టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో కంపెనీలకు అనుమతులిచ్చామని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు 8 వేలకు పైగా కంపెనీలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. రాజకీయ సుస్థిరత ఉంది కాబట్టే ఆర్థికంగా ఆశించిన వృద్ధి రేటు వస్తోందన్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నాలుగున్నరేళ్ల టీఆర్ పాలనలో ఒక్కసారి కూడా కర్ప్యూ విధించలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ ఉండే సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్నారు.

- Advertisement -