వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే ఓటేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ వచ్చినోళ్లు మాత్రమే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. మోసపోయిన వారు అందరూ బీఆర్ఎస్‌కు ఓటు వేయాలలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌తో డేంజర్ లేదని, ఏక్‌నాథ్ షిండే లాంటి వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్నారు. సీఎం పదవి ఇస్తే బీజేపీలోకి వస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని…ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరతారని చెప్పారు.
కేసీఆర్ పొలంబాట వీడియోలను చూస్తే ఎంతగా ఆదరణ ఉందో అర్థమవుతుందని, నల్గొండ జిల్లాలో ఎలా ఓడిపోయామో తెలియడం లేదని చెప్పారు. కరెంటు, నీళ్లు ఇవ్వకపోయినప్పటికీ, పంటలు ఎండిపోతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటు వేస్తే ఆ నేతలు ఐదేళ్లు తప్పించుకు తిరుగుతారని చెప్పారు.
Also Read:TDP:వాలెంటిర్లకు ‘టీడీపీ’ ముప్పు?