కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
మార్చి 27. 03.2026.
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు వృషభ లగ్నం), ఉదయం 11 గం.ల నుండి 12 గం.ల వరకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గం.ల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం.
రాత్రి – శేష వాహనం
28.03.2026.
ఉదయం – వేణుగానాలంకారము
రాత్రి – హంస వాహనం
29.03.2026.
ఉదయం – వటపత్రశాయి అలంకారము
రాత్రి – సింహ వాహనం
30.03.2026.
ఉదయం – నవనీత కృష్ణాలంకారము
రాత్రి – హనుమంత వాహనం
31.03.2026.
ఉదయం – మోహినీ అలంకారము
రాత్రి – గరుడసేవ
01-04-2026
ఉదయం – శివధనుర్భాణ అలంకరణ
మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం
సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం
Also Read:ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు?
రాత్రి – గజవాహనము
02-04-2026
ఉదయం – రథోత్సవం
03-04-2026
ఉదయం – కాళీయమర్ధనాలంకారము
రాత్రి – అశ్వవాహనం
04-04-2026
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం.
ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

