కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫీచర్ ఫోన్స్ ను ఉపయోగించే తక్కువ ఆదాయపు వినియోగదారుల సౌలభ్యం నిమిత్తం వొడా ఫోన్ ఇండియా లిమిటెడ్ (వీఐఎల్) ఓ నిర్ణయం తీసుకుంది. వారు వినియోగించే ప్రీ పెయిడ్ ప్లాన్స్ పై వ్యాలిడిటీని వచ్చే నెల 17 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వ్యాలిడిటీని పొడిగించడమే కాకుండా, వీరి కోసం రూ.10 టాక్ టైమ్ ను ఉచితంగా అందిస్తున్నట్లు వీఐఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రీ పెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ పొడిగింపు, టాక్ టైమ్ సౌకర్యం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ద్వారా ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రస్తుత పరిస్థితుల్లో లాభదాయకంగా ఉంటుందని వొడాఫోన్ ఐడియా మార్కెటింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. యూజర్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా తమ నెట్ వర్క్ టీమ్స్ ఇప్పటికే తమ పనుల్లో మునిగిపోయారని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని స్థానిక అధికారుల నుంచి తమ వినియోగదారులు తెలుసుకోవడానికి ప్లాన్ వ్యాలిడిటీ పొడిగింపు నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించారు.
Vodafone Idea on Tuesday announced extension of validity on prepaid plans availed by low income customers using feature phones till April 17,
Vodafone Idea offers, lockdown , coronavirus,corona pandemic,prepaid plans,