రొమాంటిక్ ప్రేమకథతో అశిష్‌ రాజ్

206
VKA Films Production No 2
- Advertisement -

ఆక‌తాయి చిత్రంతో ఆక‌ట్టుకొన్న క‌థానాయ‌కుడు ఆశిష్ రాజ్‌.  తొలి సినిమాతోనే డాన్స్‌, యాక్ష‌న్‌, న‌ట‌న‌… ఇలా అన్ని విభాగాల్లోనూ త‌న ప్ర‌తిభ చాటుకొన్నాడు. ఇప్పుడు రెండో చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. ఆక‌తాయి నిర్మించిన వికెఏ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ రూపొందించ‌నుంది. సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ముంబైకి చెందిన సిమ్ర‌న్ ఈ చిత్రంతో క‌థానాయికగా ప‌రిచ‌యం కానుంది. ఈనెల‌లోనే ముహూర్తం జ‌రుపుకొని, జులైలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు విజ‌య్‌, కౌశ‌ల్‌, అనిల్ మాట్లాడుతూ “ఆశిష్ రాజ్ కోసం చాలా క‌థ‌లు విన్నాం. అందులో సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పిన ఈ క‌థ బాగా న‌చ్చింది. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ నేప‌థ్యంలో జ‌రిగే ప్రేమ క‌థ ఇది. వినోదం, యాక్ష‌న్‌, థ్రిల్ ఇలా అన్నింటికీ చోటుంది. బ‌డ్జెట్ పరంగా, క్వాలిటీ ప‌రంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. అంద‌మైన లొకేష‌న్ల‌లో పాట‌ల్ని పూర్తి చేస్తాం. మూడు షెడ్యూళ్ల‌లో ఈ సినిమాని పూర్తి చేసి ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేస్తాం. మిగిలిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం అన్నారు.

సంగీతం:  సాయి కార్తీక‌
ఛాయాగ్ర‌హ‌ణం:  ప్ర‌సాద్ జీకే
పీఆర్వో:  వంశీ శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్ భాను
నిర్మాత‌లు:  విజ‌య్‌, కౌశ‌ల్‌, అనిల్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  సుబ్ర‌హ్మ‌ణ్యం

- Advertisement -