ముంబై నగర ప్రణాళిక ఓ…’స్కాం’!

14
- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సామాజిక-రాజకీయ అంశాలపై తనదైన అభిప్రాయాలను షేర్ చేస్తూ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలోని వర్షాలపై ఆసక్తికర కామెంట్ చేయడమే కాదు వీడియోలను షేర్ చేశారు.

ముంబైలోని ఎలైట్ ప్రాంతమైన నెపియాన్ సీ రోడ్ లో ఒక్క వానకే నీరు నిలిచి పోయింది. నెపియాన్ సీ రోడ్ – ఇది దేశంలోని ప్రముఖ బిలియనీర్లు, మంత్రి, ఉన్నతాధికారుల నివాస ప్రాంతం. ఒక్క వానకే ఇది మునిగిపోయింది. ఢిల్లీ, బెంగళూరు సహా ఇతర నగరాల్లో కూడా ఇదే పరిస్థితి – ప్రతి సంవత్సరం ఇంతే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతదేశపు పట్టణ ప్రణాళిక అనేది ఒక స్కాం, మాయలో కప్పిన మోసం. బీద ప్రజల పరిస్థితి ఏమిటి? ఎవరికీ పట్టించుకోవాలన్న భావం లేదంటే? అని ఎక్స్ వేదికగా తెలిపారు. వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై, థానే, పాల్‌ఘర్ జిల్లాలకు భారీ వర్షాలు కురియనుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది, లోకల్ ట్రెయిన్ సేవలు అంతరాయం కలిగాయి.ట్రాఫిక్‌లో విఘాతం ఏర్పడింది.

వివేక్ అగ్నిహోత్రి…‘ది ఢిల్లీ ఫైల్స్’ అనే కొత్త ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం ‘బెంగాల్ చాప్టర్’ అనే పేరుతో 2025లో రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ మరియు అతని భార్య పల్లవి జోషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో వివేక్ తెరకెక్కించిన‘ది వ్యాక్సిన్ వార్’ 2023లో విడుదలైంది. ఈ సినిమాలో నానా పాటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, అనుపమ్ ఖేర్, గిరిజా ఓక్, నివేదితా భట్టాచార్య తదితరులు నటించారు.

 

Also Read:GIC:హరితసేనలో వ్యాపారవేత్త సుధీర్

- Advertisement -