రివ్యూ: వివేకం

333
Vivegam movie review
Vivegam movie review
- Advertisement -

ఈ ప్రపంచమే నిన్ను ఎదురించినా.. అన్ని పరిస్థితులు నువ్ ఓడిపోయావ్ ఓడిపోయావ్ అని నీ ముందు నిలబడి అన్నా.. నువ్వుగా ఒప్పుకునేంత వరకూ ఎవరి వల్లా.. ఎక్కడా.. ఎప్పుడూ… నీపై గెలవడమే అసాధ్యం అంటూ అజిత్ ‘వివేకం’టీజర్‌తో అదరగొట్టేశాడు. తాజాగా వివేగం సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకున్నది తెలియాలంటే రివ్యూ చదవండి..

కథ:
అజయ్‌(అజిత్) ఒక ఆర్మీమెన్. టెర్రరిస్ట్ ల ఆట కట్టించే కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ కి హెడ్. ఉగ్రవాద కదలికల నేపథ్యంలో అజయ్‌ రెడ్ అలర్ట్ ని అందుకున్నాడు. ఆ ఉగ్రవాదుల కుట్ర ఏంటంటే కృత్రిమ భూకంపాలు సృష్టించి మారణం హోమం సృష్టించాలన్నదే. ఈ కుట్రను భగ్నం చేయడానికి అజయ్‌.. తన టీంతో కలిసి సెర్బియాకు వెళతాడు. అజిత్‌ గ్యాంగ్‌లోని సభ్యులు నలుగురు ఉంటారు. వీరిలో వివేక్ ఒబెరాయ్‌ ముఖ్యమైన మెంబర్‌. వీరు యూరప్‌లో ఓ సీక్రెట్ మిషన్ మీద పని చేస్తుంటారు. ఓ ఆపరేషన్‌లో భాగంగా నటాషా (అక్షర హాసన్‌) అనే క్రిమినల్‌ని పట్టుకోవడానికి బయల్దేరతాడు ఏకే. ఆమెను అన్వేషించే క్రమంలోనే ఏకే మాయమవుతాడు. అతను చనిపోయాడని ఇంటిలిజెన్స్‌ రికార్డులు చెబుతుంటాయి.

Ajith is back with Vivekam

అజిత్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సీక్రెట్‌గా ఓ మాఫియా ప్రదేశంలోకి వెళ్తాడు. 120 దేశాల్లో భయంకరమైన హ్యాకింగ్ కు సంబంధించిన కదలికల్ని అజయ్‌ కనుగొంటాడు. అయితే హ్యాకర్ గురించి అజిత్ సమాచారం తెలుసుకోవడంతొ సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. మరో వైపు అజిత్, అక్షర లని టెర్రరిస్ట్ గ్యాంగ్ కూడా అటాక్ చేసింది. ఓ వైపు అణు ఆయుధానికి తీవ్ర వాదుల ప్రయత్నం, ఇంకోవైపు అజిత్‌ వేటలో ఇంటెలిజెన్స్ బృందం బయలుదేరడంతో ఆసక్తి పెరుగుతుంది. ఒకప్పుడు అజయ్ సహాయకులుగా ఉన్నవాళ్లే అతన్ని ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నారు? అసలు అజయ్ కుమార్ కి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని నుంచి అతను బయటపడ్డాడా లేదా అన్నదే మిగిలిన సినిమా.

vivegam-ajith-main-759

ప్లస్‌ పాయింట్స్‌:
ఓ హీరో ఓరియెంటెడ్ సినిమా కథ ఎలా ఉండాలో అలాగే వుంది వివేగం. అజిత్ స్టైలిష్ లుక్‌కు తోడు కథ, కధనం ఈ సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ లెవల్‌లో చూపించడాని టెక్నాలజీని విస్తారంగా ఉపయోగించాడు డైరెక్టర్ శివ. ఈ సినిమాను అజిత్ ఇంటర్‌పోల్‌ అధికారిగా, మోస్ట్ వాటెండ్ క్రిమినల్‌గా రెండు విభిన్న పాత్రల్లో అజిత్ విశ్వరూపం చూపించాడు. సినిమాలో యాక్షన్ సీన్లు బావున్నాయని, అజిత్ వన్ మెన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్ లోను కనపడుతుంది. అజిత్ అంటే తమిళ తంబీలు ఎందుకంత పడి చచ్చిపోతారో అర్ధం అవ్వాలంటే వివేగం చూడాలి. ఇక హీరోయిన్ కాజల్ కాజల్‌ది రెగ్యులర్‌ కథానాయిక పాత్ర కాదు. కాకపోతే.. గుర్తుండిపోయే నటనను ప్రదర్శించింది. వివేక్‌ ఓబెరాయ్‌ని మన తెరపై చూడడం కొత్తగా అనిపిస్తుంది. అక్షర హాసన్‌ కనిపించేది కాసేపే. కానీ.. ఆమె కూడా ఆకట్టుకుంటుంది.

vivegam-new-stills-6

మైనస్‌ పాయింట్స్‌:
ఈ తరహా యాక్షన్‌ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నప్పటికీ అందులో కమర్షియల్ సినిమాలోకనిపించే సెంటిమెంట్ సహా అన్ని ఎలిమెంట్స్ రోటీన్‌గా ఉంటాయి. ఆ రొటీన్ సీన్స్ తగ్గి ఉంటే సినిమా ఇంకో స్థాయికి వెళ్ళేది. అయితే మాస్ పల్స్ ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే శివ కథ, కధనం నడిపించాడు. అయితే శివ మార్క్ ఎడిటింగ్ అక్కడక్కడా పేక్షకుల్ని ఇబ్బంది పెట్టింది. చాలా సన్నివేశాలు టెక్నాలజీ, వాటి టెర్మినాలజీ చుట్టూ సాగాయి. అయితే, అవి కాస్త గందరగోళ పరుస్తాయి.అభిమానులకు ఈ సినిమా ఓకే అనేలా ఉన్నప్పటికీ, మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో కొంచెం విసుగు అనిపిస్తుంది. ఇదే కామన్ ఆడియన్స్‌ని సంతృప్తి పరచలేదని చెప్పొచ్చు. అనిరుథ్‌ నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువైంది. ఎడిటింగ్‌ చాలా షార్ప్‌గా ఉంది.

ajiths-vivegam-trailer

సాంకేతిక విభాగం:
అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు బాగుంది. హాలీవుడ్‌ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో కెమెరమెన్ వెట్రి పనితనం కనిపిస్తోంది. ఈ సినిమా ప్రధాన బాగమంతా యూరప్‌లో షూట్ చేశారు. ఫైట్లు బాగున్నాయి. బైక్ రేసింగ్ సీనైతే అద్బుతం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:
ఈ సినిమా ప్రధానంగా అజిత్ ఫ్యాన్స్‌ దృష్టిలో పెట్టుకొని తీసినట్టుగా అనిపిస్తుంది. మిగిలిన యాక్షన్‌ చిత్రాల్లాంటిది కాదు ‘వివేకం’. పేరుకు తగ్గట్టు కాస్త వివేకం జోడించాడు దర్శకుడు. కథానాయకుడు – ప్రతినాయకుల తెలివితేటలు, ఎత్తుకు పైఎత్తుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ ఓ హాలీవుడ్‌ సినిమా చూస్తున్నామేమో అనిపిస్తుంది. అజిత్ అంటే తమిళ తంబీలు ఎందుకంత పడి చచ్చిపోతారో అర్ధం అవ్వాలంటే వివేగం చూడాలి.

విడుదల తేదీ:24/08/2017
రేటింగ్ : 2.5|5
న‌టీన‌టులు: అజిత్‌, కాజల్‌, వివేక్‌ ఓబెరాయ్‌, అక్షర హాసన్‌
సంగీతం: అనిరుథ్‌
నిర్మాత‌లు: సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌
ద‌ర్శ‌క‌త్వం: శివ

- Advertisement -