కాజల్ చాలా హాట్ గురూ…

279
Kajal-Agarwal
- Advertisement -

వయసు తగ్గినా.. వన్నె తగ్గని భామ అనే మాటను కొందరి భామలకు మాత్రమే వాడగలం. అయితే ఈ మాట మాత్రం అందాల చందమామ కాజల్ అగర్వాల్ కి కూడా చెందుతుంది.

ఎప్పుడో పదేళ్ల కిందట సినీ రంగంలోకి అడుగుపెట్టిన కాజల్ , ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో తన అందం, అభినయానికి తన తోటి హీరోహీరోయిన్లంతా మంచి మార్కులే వేశారు.

kajal agarwal

అయితే ఈ అమ్మడు నటించిన ‘వివేగం’ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నుదుట కుంకుమ బొట్టు… మెడలో తాళిబొట్టు… హుందాగా చీరకట్టు… కొత్తగా కనిపిస్తూ కాజల్‌ అగర్వాల్‌ కనికట్టు చేస్తుందట. రీసెంట్‌గా రిలీజైన ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరో వైఫ్‌ క్యారెక్టర్‌లో కనిపించిన కాజల్, ఈ సినిమాలోనూ హీరో వైఫ్‌గా కనిపించనుంది.

అయితే కాజల్‌ ఆదివారం నాడు తన ఫ్యాన్స్‌ కోసం ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో పెట్టింది. అందులో కాజల్ చూపులు.. లుక్.. డ్రెస్సింగ్.. అన్నీ కూడా కుర్రాళ్లకు మతిపోగొట్టేస్తున్నాయి. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో కూడా వైరల్‌గా మారింది. మొత్తానికి తన ‘స్టేట్ ఆఫ్ మైండ్’ ఇదే అంటూ.. మగాళ్ల ‘స్టేట్ ఆఫ్ మైండ్’ను మార్చే ఫొటోను షేర్ చేసేసింది కాజల్.

- Advertisement -