విటమిన్ లోపం.. తప్పక తెలుసుకోండి!

3
- Advertisement -

విటమిన్లు మన శరీరానికి ఎంతో అవసరం. రోగ నిరోధక శక్తి పెంచడానికైనా, వివిధ రకాల జబ్బుల బారిన పడకుండా కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కొన్ని విటమిన్లు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవడం ద్వారా జబ్బుల బారిన పడకుండా ఉంటాం.

విటమిన్ డి అనేది మన శరీరంలో ఎంతో ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, ఎముకలను దృఢంగా మార్చడంలోనూ, కండరాలను బలపరచడంలోనూ విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే కాల్షియం శోషణం జరగాలంటే విటమిన్ డి చాలా అవసరం. ఒకవేళ ఇది లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. విటమిన్ డి లోపం ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తద్వారా తరచూ జబ్బు పడతారు. సాధారణంగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం గంట లేదా అరగంట సూర్యరశ్మిలో ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చలికాలంలో విటమిన్ డి లోపించకుండా వీటిని ఆహార డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌ ‘సి’ది ముఖ్య భూమిక. ఈ విటమిన్‌ లోపం ఉన్న వాళ్లు త్వరగా జబ్బు పడే అవకాశాలున్నాయి. నిమ్మకాయ, క్యాప్సికం, పాలకూర వంటివి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ సీ లోపం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వాపు, రక్తస్రావం లాంటి సమస్యలు ఎదరవుతాయి.

రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్‌ ‘బి6’ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అరటిపండ్లు, చేపలు, చికెన్‌, బంగాళాదుంపలు, శెనగలు విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. విటమిన్ బీ6 లోపం ఉన్న వాళ్లు ఫిట్సు లాంటి వ్యాధులు, అజీర్తి, రక్తహీనత, కోపం ఎక్కువగా రావడం వంటివి జరుగుతాయి.

మన శరీరంలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా విటమిన్ ఇ పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడి అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఆపుతుంది. పొద్దుతిరుగుడు గింజలు, పల్లీలు, బాదంపప్పులు, పాలకూర, నట్స్ వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. క్యారట్స్, తర్బూజా, గుమ్మడికాయ, సొరకాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -