- Advertisement -
రోరింగ్ స్టార్ శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా “బ్రాండ్ స్టూడియోస్” హాలేష్ కోగుండి టీమ్ రూపొందిస్తున్న ఎక్సయిటింగ్ న్యూ మూవీ “పరాక్”ని అనౌన్స్ చేశారు. ఇది అభిమానులకు ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందని ప్రామిస్ చేసింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మార్చిలో సెట్స్‌పైకి రానుంది . పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్‌పై రూపొందుతోంది.
ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని, శ్రీమురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, “బ్రాండ్ స్టూడియోస్” టీం ఈ చిత్రం పోస్టర్‌ను రిలీజ్ చేశారు, ఇది అభిమానులలో, సినీ ప్రేక్షకులలో క్యురియాసిటీని క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
Also Read:Look Back 2024:ఈ ఏడాది పెళ్లిచేసుకున్న సెలబ్రెటీలు వీరే!
- Advertisement -