లెజెండ్ కె.విశ్వనాథ్ మరణానికి.. కారణం అదే!

69
- Advertisement -

కళకు ప్రాణం పోస్తూ.. కళను బ్రతికించిన సినీ దర్శకులలో కళ తపస్వీ కె. విశ్వనాథ్ ఒకరు. దాదాపు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రతి సినిమాలోనూ కళకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఆయన దర్శకత్వం నుంచి జాలువారిన చిత్రాలన్నీ తెలుగు సినీ పుస్తకంలో ఆణిముత్యాల్లా మిగిలిపోయాయి. అలాంటి లెజెండ్ డైరెక్టర్ ఇక లేరు..గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న కె. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ( ఫిబ్రవరి 2 ) తుది శ్వాస విడిచారు. .

92 ఏళ్ల ఆయన వయో భారంతోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. తన తుది శ్వాస వరకు కళ కోసమే బ్రతికిన ఆయన.. కన్ను మూసే చివరి క్షణంలో కూడా తన కుమారుడితో పాట రాయిస్తూ కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కె. విశ్వనాథ్ మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ మూగ బోయింది. లెజెండ్ డైరెక్టర్ ను కోల్పోయామంటూ దుఖంలో మునుగుతోంది. కేవలం తెలుగు తమిళ్ సినిమాలకే కాకుండా బాలీవుడ్ లోనూ 9 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరభరణం, సాగరసంగమం, స్వర్ణ కమలం, శుభసంకల్పం వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలు తెలుగు సినీ పుస్తకంలో చెరిగిపోని ముద్ర వేశాయి.

1965లో వచ్చిన ” ఆత్మగౌరవం ” సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన కె. విశ్వనాథ్.. తన చివరి చిత్రంగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు.కె.విశ్వనాథ్ కు కళపై ఉన్న మమకారాన్ని మెచ్చి ఎన్నో అవార్డులు, పురస్కారాలు ఆయనను వరించాయి. 1992 లో పద్మశ్రీ, రగుపతి వెంగయ్య పురస్కారాలతో పాటు 2017 లో దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ కూడా ఆయనను వరించింది. ఇక తన సినీ కెరియర్ లో 5 నంది అవార్డులు, 5 జాతీయ అవార్డులు, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులు కె. విశ్వనాథ్ అందుకున్నారు. ఇక కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారాయన. తనకు అతర్జాతీయ ఖ్యాతి సుసుకొచ్చిన శంఖరాభరణం మూవీ రిలీజ్ అయి 43 ఏళ్ళు పూర్తి అయిన రోజునే ఆయన తుది శ్వాస విడవడం గమనార్హం. ఏది ఏమైనా సినీ కె. విశ్వనాథ్ అందించిన సేవలు చిరస్మరణీయం. ఇండస్ట్రీలో ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేనిదనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -