Cult:అప్‌డేట్ ఇచ్చిన విశ్వక్

3
- Advertisement -

వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అయ్యారు నటుడు విశ్వక్ సేన్. తాజాగా ‘Cult’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు విశ్వక్. ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. తాజాగా విశ్వక్ సేన్ ప్రమోషనల్ ప్లాన్‌ను ప్రారంభించారు.

“Jee Boom Baa” అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ, ఇది ఆటబొమ్మ కాదు, జోక్ కాదు, పిల్లల కోసం కాదు అని పేర్కొన్నారు. రేపు ఉదయం 11:11 గంటలకు కొత్త అప్డేట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 22, 2026న టీజర్ విడుదలకు సంబంధించిన ప్రకటన ఉండొచ్చని సమాచారం. టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత హింసాత్మక టీజర్‌గా ఇది ఉండబోతుందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. గాయత్రి భరద్వాజ్, యజ్ఞ తుర్లపాటి హీరోయిన్స్‌గా నటిస్తుండగా తారక్ పొన్నప్ప ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

- Advertisement -