హీరో విశ్వక్‌ సేన్ ..చక్రధారి

10
- Advertisement -

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా రిలీజైన ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు. ట్రైలర్ చాలా బాగుందని ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే విధంగా ఉందని తెలిపారు. సినిమా నిర్మించి విడుదల చేయడం అనేది ఓ సాహసమని ఆ విషయంలో చిత్ర నిర్మాత కే. ఓ. రామరాజు విజయం సాధించారు అని, సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు.

చిత్రంలో నటించిన హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్‌, హీరోయిన్స్ శశికా టిక్కో, అశురెడ్డి లకు ప్రత్యేక విషెస్ చెప్పారు. అలాగే చిత్రంలో నటించిన మిగితా నటీనటులకు, టెక్నిషియన్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న *పద్మవ్యూహంలో చక్రధారి* సినిమాను ప్రేక్షకులు ఆదరించి, విజయవంతం చేయాలని కోరారు. ట్రైలర్ లో చూపించినట్లు ఫస్ట్‌లవ్‌లో ఫెయిల్‌ అయిన వ్యక్తి అదే ధ్యాసలో ఉంటూ వేదన పడుతాడని, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేదాన్ని.. ఎంతో ఆసక్తితో అన్ని హంగులు సమపాలల్లో ఉండేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ జూన్ 21న ఘనంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అయింది. కచ్చితంగా చిత్రం మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Also Read:చర్మ సమస్యలకు వీటితో చెక్..

- Advertisement -