డిటెక్టివ్‌గా మారిన విశాల్..

236
Vishal Thupparivaalan Official Trailer
- Advertisement -

విశాల్ మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సారి కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన ‘తుప్పారివాలన్’ సినిమా చేశాడు. స్నేహ భర్త ప్రసన్న .. అనూ ఇమ్మాన్యుయేల్ .. ఆండ్రియా ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగులో ఆ మధ్య ‘పిశాచి’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? చాలా కొత్తగా అనిపించిన ఆ హార్రర్ థ్రిల్లర్ మూవీని రూపొందించిన దర్శకుడి పేరు.. మిస్కిన్. తమిళంలో చాలా వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు ఈ దర్శకుడు. పెద్దగా పేరు లేని హీరోలతో సినిమాలు చేసే మిస్కిన్.. తొలిసారిగా విశాల్ లాంటి స్టార్ హీరోతో ఓ సినిమా చేశాడు.

Vishal Thupparivaalan Official Trailer

విశాల్ ‘తుప్పారివాలన్’లో డిటెక్టివ్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ మూవీలో సీరియల్ హత్యల మిస్టరీని ఛేదిస్తాడు. అతడి గెటప్ కానీ.. పాత్ర తీరు తెన్నులు కానీ.. డైలాగులు కానీ కొత్తగా అనిపిస్తున్నాయి. సినిమాకు యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణలా ఉన్నాయి. ట్రైలర్ ఇంటెన్స్ గా ఉండి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ చిత్రంలో విశాల్ కు హీరోయినే లేకపోవడం విశేషం. ఆండ్రియా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. స్నేహ భర్త ప్రసన్న ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.

- Advertisement -