Vishal:ఎనిమిది కోట్లు వద్దన్న విశాల్

22
- Advertisement -

ఇప్పుడంతా పాన్ ఇండియా మయం. స్వంత భాషలో డిమాండ్ ఉండి, పక్క భాషల్లో కూడా పరిచయం అయ్యి ఉంటే.. అలాంటి నటీనటులకు ఫుల్ డిమాండ్ ఉంది. సహజంగా పాన్ ఇండియా మార్కెట్ కి అన్ని భాషల్లో పరిచయం ఉన్న నటీనటులే కావాలి. అలాంటి వారి కోసం మేకర్స్ కూడా ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధంగా ఉంటారు. ఇటు నటీనటులు కూడా సూక్ష్మంలో మోక్షం వస్తుంది అంటే వద్దనేవారు వుండరు. పైగా ముఫై రోజులు డేట్‌లు ఇస్తా 60 కోట్లు ఇవ్వండి అనే హీరోలే ఎక్కువ.

ఇక స్పెషల్ రోల్ అంటే చాలు మొహమాటం లేకుండా 15 కోట్లు వసూలు చేసే మాస్ హీరోలు, రోజుకు 5 లక్షలు తీసుకుని నటించే పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువే ఉన్నారు. అలాంటిది జస్ట్ ఓ పది రోజులు వర్క్ చేస్తే చాలు ఎనిమిది కోట్లు సింగిల్ పేమెంట్ ఇస్తా అంటే నో అన్నాడు హీరో విశాల్. విషయం ఏమిటంటే.. షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న ఓ హిందీ సినిమాకు, హీరో విశాల్ ను స్పెషల్ క్యారెక్టర్ కు తీసుకుందాం అనుకున్నారు. సినిమాలో హీరో షాహిద్ కపూరే. కానీ విశాల్ ది స్పెషల్ క్యారెక్టర్

అందుకనే విశాల్ ను అప్రోచ్ అయ్యారట ఆ సినిమా నిర్మాత. ఎనిమిది కోట్లు సింగిల్ పేమెంట్ ఇస్తానని కబురు చేసినట్లు తెలస్తోంది. దానికి సింపుల్ గా హీరో విశాల్ నో అన్నాడని తెలుస్తోంది. సరైన క్యారెక్టర్లు, సరైన సినిమాలు ముఖ్యం కానీ, డబ్బులు కాదని, విశాల్ నో చెప్పేసాడట. మొత్తం మీద టాలీవుడ్ లో ఎంత తక్కువ డేట్ లు ఇచ్చి, ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిద్దామా అనే హీరోల నడుమ ఇలా ఆలోచించే.. కోలీవుడ్ హీరో కూడా వుండడం ఆశ్చర్యకమే.

Also Read:Sree Leela:ఆ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చింది

- Advertisement -