జస్టిన్ కౌర్ ఆత్మహత్య కలచివేసింది..

223
Jasleen Kaurs Suicide
- Advertisement -

నీట్‌లో ర్యాంక్ రాలేదని హైదరాబాద్ బర్కత్‌పురాకు చెందిన జస్టిన్ కౌర్‌ అబిడ్స్‌లోని మయూరి కాంప్లెక్స్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జస్టిన్ కౌర్‌ మృతిపై స్పందించారు హీరో విశాల్. నీట్‌లో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి బాధపడ్డానని తెలిపారు. నీట్ వల్ల ఒకరి తర్వాత ఒకరిగా చాలా మందిని కొల్పోయాని….విద్యార్థులు నీట్‌ పరీక్షని పబ్లిక్ సర్వీస్ పరీక్షలానే భావించి సాధించే వరకు ప్రయత్నించాలన్నారు.

దేశ భవిష్యత్ విద్యార్థుల మీదే ఆధారపడి ఉందని..ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల కలలు ఎండమావిగానే మిగిలిపోతాయన్నారు. విద్యార్ధులకి సహాయం అందించడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.

నీట్ పరీక్షని భవిష్యత్తులో కొనసాగించే పరిస్ధితి వస్తే ప్రభుత్వమే విద్యార్ధులకి కోచింగ్ తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే పేద విద్యార్ధులకి వైద్య విద్య అనేది కలగానే ఉండిపోతుందన్నారు.

- Advertisement -