విశాల్ ‘పందెం కోడి 2’ ట్రైల‌ర్..

242
Vishal Pandem Kodi 2
- Advertisement -

విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో కొంతకాలం క్రితం ‘పందెం కోడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అదే కాంబినేషన్‌ ‘పందెం కోడి 2’ తెలుగు తమిళ్‌లో రూపొందుతుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.

Vishal Pandem Kodi 2

తాజాగా తెలుగు చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో విశాల్ ర‌ఫ్ఫాడించాడు. కీర్తి సురేష్ త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. లేడి విల‌న్ గెట‌ప్‌లో వ‌ర‌ల‌క్ష్మీ లుక్ అదిరిపోయింది. జాతరలో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందే వేషాలు వేయకూడదు అనే డైలాగ్ అదిరిపోయింది. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ద‌స‌రా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -