31న విశాల్ ‘మదగజరాజా’

7
- Advertisement -

విశాల్ సెన్సేషనల్ హిట్ ‘మదగజరాజా’ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. సుందర్ సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, పండుగ సీజన్‌లో తమిళంలో నంబర్ వన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యాక్షన్-కామెడీ సినిమా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఈరోజు విక్టరీ వెంకటేష్ ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ ట్రైలర్ కామెడీ, యాక్షన్ పర్ఫెక్ట్ బ్లెండ్ తో ఎంటర్ టైనింగ్ రైడ్‌ను అందించింది. విశాల్, సంతానం మధ్య హిలేరియస్ కెమిస్ట్రీ అదిరిపోయింది. విలన్ సోను సూద్ విశాల్‌తో ఢీకొట్టడం ఒక గ్రిప్పింగ్ షోడౌన్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది.

విశాల్ తన సిగ్నేచర్ ఎనర్జీతో అదరగొట్టారు. సంతానంతో అతని కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇద్దరూ గ్లామర్‌ను జోడించడం మరింత ఆకర్షణగా నిలిచింది.

కామెడీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన దర్శకుడు సుందర్ సి, మరోసారి తన మార్క్ ఎంటర్ టైనర్ అందించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా మద గజ రాజా హిట్ అవుతుందని ట్రైలర్ హామీ ఇస్తోంది.

రిచర్డ్ ఎం. నాథన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విజయ్ ఆంటోనీ పవర్ ఫుల్ మ్యూజిక్ ఎనర్జీని మరింత ఎలివేట్ చేసింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది.

Also Read:ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టకూడదు?

- Advertisement -