విశాల్ ‘ఎనిమి’ ట్రైలర్ రిలీజ్‌..

127
- Advertisement -

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి వచ్చింది? అనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ అద్భుతంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మిర్నాలిని రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌డీ రాజశేఖర్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -