విశాఖ-ఖరగ్పూర్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే

2
- Advertisement -

ఏపీ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం-ఖరగ్ పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్,ఒడిశా,పశ్చిమ బెంగాల్ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను నిర్మించనున్నారు.

దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్ లో భాగంగా ఈ జాతీయ రహదారిని నిర్మించనుంది.

Also Read:TRAI: ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం

- Advertisement -