గ్లోబల్ కనెక్టివ్‌ హబ్‌గా విశాఖ

6
- Advertisement -

గ్లోబల్ కనెక్టివ్ హబ్‍గా విశాఖ మారనుంది అన్నారు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్-సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల పెద్దఎత్తున్న పెట్టుబడులు పెట్టడమిదే తొలిసారి.

జెమినీ-ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి అని తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశం ఉందని… భారత్‍కే కాదు.. విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీకి అవకాశం ఉందని తెలిపారు.

నా రాజకీయ జీవితంలో గూగుల్ ఒప్పందం పెద్ద విజయం అన్నారు చంద్రబాబు. గూగుల్ విశాఖలో అడుగుపెడుతోంది … గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశాం … ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం అన్నారు.

Also Read:రాజకీయ పార్టీల ప్రకటనలపై ఈసీ

- Advertisement -