‘విరూపాక్ష’గా సాయితేజ్ .. గ్లింప్స్ అదుర్స్ !

133
- Advertisement -

మెగా మేనల్లుడు సాయ్ ధరమ్ తేజ్ గత ఏడాది వచ్చిన ” రిపబ్లిక్ ‘ మూవీ తరువాత.. యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే తన సినీ కెరియర్ పై మళ్ళీ దృష్టి పెట్టాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రా యూనిట్. ” అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢ నమ్మకానికి కారణం.. ” అంటూ సాగే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీజర్ లోని విజువల్స్ ను బట్టి చూస్తే మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం అర్థమౌతోంది..

ఈ మూవీనీ కార్తీక దండు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా సుకుమార్ రైటింగ్స్, మరియు శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీనీ పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రెల్ 21 న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కమర్షియల్ మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన సాయి ధరమ్ తేజ్ మొదటి సరిగా ” విరూపాక్ష ” మూవీతో ఒక సస్పెస్స్ థ్రిల్లర్ జోనర్ లో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గటుగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ కూడా క్యూరియాసిటీగా ఉండడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మరి మెగా మేనల్లుడికి విరూపాక్ష మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -