బెంగాల్ కాబోయే సీఎం దాదానే:సెహ్వాగ్

545
ganguly
- Advertisement -

పశ్చిమ బెంగాల్ కాబోయే సీఎం సౌరవ్ గంగూలీ అని జోస్యం చెప్పారు భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీపై ప్రశంసలు గుప్పించిన వీరు…..దాదా విషయంలో తాను చెప్పింది నిజమైందన్నారు.

2007లోనే గంగూలీ బీసీసీఐ చీఫ్ అవుతారని చెప్పానని అది నిజమైందన్నారు. కేప్‌టౌన్‌లో జరుగుతున్న టెస్టులో తాను, వసీంజాఫర్ త్వరగా అవుటయ్యామని, సచిన్‌ బదులు బ్యాటింగ్‌కు దిగిన గంగూలీ ఆ మ్యాచ్‌లో దాదా అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు.

డ్రెస్సింగ్ రూములో మాటల మధ్యలో మనలో ఎవరికైనా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అర్హత ఉందంటే అది ఒక్క గంగూలీకేనని చెప్పానని, తన మాటలను అందరూ అంగీకరించారని పేర్కొన్నాడు. భవిష్యత్తులో గంగూలీ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతాడని ఇది నిజమవుతుందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -