జై రామ్…జైజై రామ్: సెహ్వాగ్

523
sehwag
- Advertisement -

అయోధ్య తీర్పుపై స్పందించాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అయోధ్య భూమి వివాదం చాలా సున్నితమైనది కావడంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ‘ శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్ అని శ్రీరాముడి ఫొటోని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్‌ ట్వీట్‌పై అభిమానుల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది.

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2.77 ఎకరాల ఆ భూమిని రామ మందిరం కోసం హిందువులకి అప్పగించాలని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే ముస్లింలకి కూడా 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది.

- Advertisement -