15న ‘విరాట‌ప‌ర్వం’ ప్రీ రిలీజ్.. గెస్టులు వీరే..

93
VirataParvam
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.ఈ వేడుకకు విక్టరీ వెంకటేశ్,రాంచరణ్, డైరెక్టర్‌ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుందంటూ అధికారిక పోస్టర్‌ను వదిలారు.

- Advertisement -