విరాటపర్వం సెన్సార్ రిపోర్ట్.. !

80
virataparvam
- Advertisement -

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా , సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. జూన్ 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా, అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించింది.

తాజాగా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు 2 గంటల 31 నిమిషాల రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. ఒక చక్కటి ప్రేమకథను ఫక్తు కమర్షియల్ సినిమాలో చూపిస్తూ ఇలాంటి రన్‌టైమ్‌ను లాక్ చేయడం సినిమాకు చాలా బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర కథాంశానికి ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి ప్రేమకావ్యాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని వెల్లడించారు. ఇక విరాటపర్వం ప్రీ రిలీజ్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరగనుండగా అతిథులుగా విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌లు వస్తున్నారు.

- Advertisement -