ట్రెండింగ్‌లో విరాటపర్వం

108
rana
- Advertisement -

రానా – సాయి పల్లవి జంటగా ప్రియమణి ముఖ్యపాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. జూన్ 17న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో రానా- సాయి పల్లవి విశ్వరూపం చూపించారు.

రక్తపాతం ఎక్కడ లేదు.. పుట్టినప్పుడు అమ్మ కడుపులోనుంచే మొదలైంది లాంటి అద్భుతమైన డైలాగ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ రాత్రుండదు, పగలుండదు… ఉన్నదల్లా ఊపిరికీ ఊపిరికీ మధ్య ఊపిరిసలపనంత యుద్ధమే అని రానా చెప్పే డైలాగ్ ఆకట్టుకున్నాయి. 1990ల నాటి నక్సలిజం చుట్టూ అల్లుకున్న ప్రేమగాథతో రూపొందిన చిత్రం ఇది. ట్రైలర్‌లో రవన్న, వెన్నెల పాత్రల్లో రానా, సాయిపల్లవి పలికించిన సంఘర్షణ, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి.

- Advertisement -