ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ రెండో విజయంను నమోదు చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0తో ఆధిక్యత సాధించింది. అయితే న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 25వేల పరుగులు పూర్తి చేసుకున్నారెండో భారత ఆటగాడిగా నిలిచారు. దీంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టారు.
25వేల పరుగల మైలురాయిని చేరుకోవడానికి సచిన్‌కు 577మ్యాచ్‌లు ఆడగా…విరాట్ మాత్రం 549మ్యాచ్‌లతో రికార్డును చేరుకున్నారు. సచిన్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (588) దక్షిణాఫ్రికా ఆటగాడు కలీస్(594) శ్రీలంక మాజీ కెప్టెన్‌లు కుమార సంగక్కర(608)మహేల జయవర్దనె(701) ఈ ఫీట్‌ను సాధించారు. రెండో టెస్ట్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరొక మ్యాచ్‌ను భారత్ గెలిస్తే ప్రపంచంలో టెస్ట్‌లో టాప్ ర్యాంకింగ్ స్థానంను సంపాదించుకొనుంది.
Yet another milestone to Virat Kohli's name ⭐#WTC23 | #INDvAUS pic.twitter.com/XnnNZneik3
— ICC (@ICC) February 19, 2023
ఇవి కూడా చదవండి…