సీఏసీ సభ్యుడిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్ విరాట్ కోహ్లికి జలక్ ఇచ్చాడు. హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే వ్యవహార శైలి నచ్చలేదని పంతం పట్టి సాగనంపిన కోహ్లీకి దాదా సలహా ఇచ్చాడు.. కోచ్ ల బాధ్యతలు, పనితీరుని విరాట్ అర్థం చేసుకోవాలని సూచించాడు. వెస్టిండీస్ నుంచి తిరిగి వచ్చాక కొహ్లీతో మాట్లాడి హెడ్ కోచ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నిన్న జరిగిన ఇంటర్వ్యూలు జరిగాయి. లక్ష్మణ్, గంగూలీ ప్రత్యక్షంగా.. లండన్ లో ఉన్న మరో సభ్యుడు సచిన్ టెండూల్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. సీఏసీ ముందు ఇంటర్వ్యూకు హాజరైంది సెహ్వాగ్ ఒక్కడే. అతడి ఇంటర్వ్యూ రెండు గంటలు జరిగింది. ఫిల్ సిమన్స్ (వెస్టిండీస్) ఇంటర్వూకు హాజరు కాలేదు.
గుంగూలీ మాట్లాడుతూ.. నిర్ణయం తీసుకోవడానికి మాకు మరికొన్ని రోజుల సమయం అవసరమని.. అందుకే కోచ్ నియామకాన్ని నిలిపి ఉంచామని తెలిపారు.. శ్రీలంక పర్యటనకు ఇంకొన్ని రోజుల సమయం ఉన్నందున తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక కోచ్‌లు ఎలా పని చేస్తారన్నది విరాట్ కోహ్లి అర్థం చేసుకోవాలని దాదా అన్నారు. అదే సమయంలో కోచ్ సెలక్షన్ ప్రక్రియకు దూరంగా ఉన్నందుకు అతణ్ని అభినందించాలని.. వెస్టిండీస్ నుంచి తిరిగొచ్చాక అతడితో చాలా వివరంగా మాట్లాడాలనుకుంటున్నామని తెలిపారు.
ఇక సీఏసీనిర్వహించిన టీమిండియా చీఫ్ కోచ్ ఎంపికలో రవిశాస్త్రికి మొండి చెయ్యి ఎదురయ్యేలా కనిపిస్తోంది. నిన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు నిర్వహించే ముందు వరకు కూడా చీఫ్ కోచ్ గా మాజీ దిగ్గజ ఆటగాడు రవిశాస్త్రి ఎంపికవుతాడని అంతా భావించారు. రవిశాస్త్రికి గంగూలీతో గత కొంత కాలంగా విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. శాస్త్రిని ముఖాముఖి ఇంటర్వ్యూ గంగూలీ చేయాల్సి వచ్చింది. అయితే నిన్న జరిగిన ఇంటర్వ్యూల్లో రవిశాస్త్రికి అంత అనుకూలమైన వాతావరణం ఏదీ లేదని అంతర్గత సమాచారం.
అంతే కాకుండా కోచ్ నియామకంలో గూంగూలీ కోహ్లీని కూడా భాగస్వామిని చేశాడు. దీంతో తాజా కోచ్ ఎంపికలో తమ హస్తం మాత్రమే లేదని, రేపు ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంటే కోహ్లీని బాధ్యుడిని చేసే అవకాశం ఉందని గంగూలీ భావిస్తున్నాడు. ఈ నిర్ణయంతో కోహ్లీకి చెక్ చెప్పడంతో పాటు, కొత్త కోచ్ పై పూర్తి బాధ్యతలు పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.