హ్యాపి బర్త్ డే కోహ్లీ..

319
Virat Kohli's 29th Birthday
- Advertisement -

ఇండియన్ క్రికెట్ సెన్సేషన్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఇవాళ 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన విరాట్‌కు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీతోపాటు మాజీ క్రికెటర్లు విరాట్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రముఖ శాండ్ ఆర్ట్ నిపుణుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో కోహ్లి సైకత శిల్పాన్ని వేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అటు న్యూజిలాండ్‌తో రెండో టీ20 ముగిసిన తర్వాత రాత్రి 12 గంటలకు హోటల్ రూమ్‌లోనే విరాట్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో టీమిండియా పాల్గొన్నది.

ఈ సందర్భంగా విరాట్‌ను కేక్‌లో ముంచెత్తారు మిగతా ప్లేయర్స్. కెప్టెన్ అని కూడా చూడకుండా దొరికిందే చాన్స్ అన్నట్లు అతన్ని గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా చేశారు. ఎవరి బర్త్ డే జరిగినా.. ఆ ప్లేయర్‌ను కేక్‌తో ముంచెత్తడం టీమిండియా ఆనవాయితీగా మారింది. అది కెప్టెన్ అయినా సరే. ఈ మధ్యే పాండ్యాకు కూడా ఇలాగే చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కోహ్లిపై తనకు ప్రతీకారం తీసుకునే చాన్స్ దక్కిందని ఈ సందర్భంగా పాండ్యా ట్వీట్ చేశాడు.

Virat Kohli's 29th Birthday

ఆటలో దూకుడు మాటలో ముక్కుసూటితనం ఈ రెండు కలిస్తే కోహ్లీ. భాతర క్రికెట్ చరిత్రలోనే వండర్ కెప్టెన్ గా నిలిచాడు. వన్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్ ఏదైనా సరే విజయం వరించాల్సిందే. భారత్ క్రికెట్ లో ఇప్పుడంతా యువరక్తమే. దానికి ప్రతీక కోహ్లీ. ఇంటా, బయట రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ ఢిల్లీ కుర్రాడు. 28 ఏళ్లకే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. స్ట్రాంగ్ టీమ్ లకు కూడా షాక్ లపై షాకిలిస్తూ విజయాలు సొంతం చేసుకుంటుంది కోహ్లీసేన. ధోనీ నుంచి కెప్టెన్సీ తీసుకున్న ఫస్ట్ మ్యాచ్ లోనే అదరగొట్టాడు విరాట్. అద్భుతమైన గెలుపుతో విజయ పరంపరను మొదలుపెట్టాడు. అన్ని ఫార్మాట్ లలోనూ టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లీ… మరెన్ని విజయాలు సాధిస్తాడోనని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.

Virat Kohli's 29th Birthday

కెప్టెన్ గా మొదటి వన్డేలో తన కెరీర్ లో 27వ సెంచరీ రికార్డ్ చేశాడు. ఛేజింగ్ కింగ్ గా తనకున్నపేరును మరోసారి నిలబెట్టాడు విరాట్. టీమిండియా 3 సార్లు 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్ గా ఛేజ్ చేసింది. అందులో ప్రతిసారి కోహ్లీ కంట్రిబ్యూషన్ ఉంది. ఆ 3 సార్లు కూడా కోహ్లీ సెంచరీలు కొట్టాడు. కెప్టెన్ గా అదనపు భారం తన నెత్తిన పడినా కోహ్లీ బ్యాటింగ్ పై ఎలాంటి ఎఫెక్ట్ కనిపించలేదు. వైస్ కెప్టెన్ గా ఉన్ననాటి ఊపునే ఫస్ట్ వన్డేలోనూ కంటిన్యూ చేశాడు కోహ్లీ. స్టార్టింగ్ లో కొంతకాలం అదరగొట్టి తర్వాత చప్పబడిపోయే సంప్రదాయం గత భారత జట్టు కెప్టెన్ లలో స్పష్టమైంది. కానీ దానిని కోహ్లీ బ్రేక్ చేస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Virat Kohli's 29th Birthday

బ్యాట్ తోనే కాదు.. నోటి తో కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కోహ్లీ. ఆస్ట్రేలియన్లకు పోటీగా గ్రౌండ్ లో మాటల యుద్ధానికి దిగాడు. స్లెడ్జింగ్ పై మాజీ ప్లేయర్స్ నుంచి విమర్శలొస్తున్నా… దూకుడే తన బలమంటున్నాడు కోహ్లీ. కెప్టెన్ గా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతానని స్పష్టంచేస్తున్నాడు.

- Advertisement -