ఆట మధ్యలో అభిమాని హల్‌చల్‌.. కోహ్లీ రియాక్షన్‌!

303
kohli

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విదేశాల్లోనూ ఆయనంటే పడిచస్తారు అభిమానులు. విరాట్ కూడా అభిమానులను ఎప్పుడూ నిరాశ పరచకుండా వాళ్లకు తన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటున్నాడు. కోహ్లీతో ఒక్కసారి అయినా, కలవాలని, అతనితో మాట్లాడాలని, వీలైతే సెల్ఫీ దిగాలని అభిమానులు కలలు కంటుంటారు. కానీ, పోలీసుల భద్రత, బారికేడ్లు వారికి ఆ అవకాశం ఇవ్వవు. ఇదే సమయంలో కొందరు మాత్రం వాటిని చేధించుకుని దూసుకొస్తుంటారు.

Virat Kohli

తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఇండియా-బాంగ్లాదేశ్ మధ్య జరిగిన ఇండోర్ టెస్ట్‌లో జరిగింది. ఉత్తరాఖండ్‌కు చెందిన సూరజ్ అనే అభిమాని బారీకేడ్ దూకేసి గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది సూరజ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కోహ్లీ ఆ అభిమానిని పట్టుకోవద్దని చెప్పి, దగ్గరికి తీసుకొని భుజంపై చేయివేసి మాట్లాడాడు.

ఇటువంటి పనులు కూడవని చెబుతూ, మైదానం బయటకు పంపాడు. అతన్ని ఏమీ చేయవద్దని సెక్యూరిటీకి సూచించాడు. అభిమాన క్రికెటర్‌తో మాట్లాడిన ఆ అభిమాని సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం మొత్తం ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.