విరాట్ కోహ్లీ..ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్

3
- Advertisement -

భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా కనిపించకుండా పోవడం ప్రపంచ క్రికెట్‌తో పాటు సోషల్ మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది. జనవరి 30 నాటికి, 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పూర్తిగా అదృశ్యమైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, కొద్ది గంటల వ్యవధి తర్వాత కోహ్లీ ఖాతా తిరిగి అందుబాటులోకి రావడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.

జనవరి 30 ఉదయం తొలివేళల్లోనే ఈ విషయం అభిమానులు గమనించగా, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వారికి “ఈ పేజీ అందుబాటులో లేదు” లేదా “లింక్ బ్రోకెన్ అయి ఉండొచ్చు” అనే సందేశాలు కనిపించాయి. అయితే, కోహ్లీకి చెందిన ఎక్స్ (X) ఖాతా మాత్రం యథావిధిగా యాక్టివ్‌గా ఉండటంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఇలా జరగడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇది కోహ్లీ స్వయంగా ఖాతాను డీయాక్టివేట్ చేశారా? లేక సాంకేతిక లోపమా? అన్నది ఇప్పటివరకు స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఖాతా తిరిగి పునరుద్ధరించబడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:సిట్ నోటీసులకు బదులిచ్చిన కేసీఆర్

- Advertisement -