విరాట్..ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం ఎంతోతెలుసా.

301
kohli
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదాయం అంతకుఅంత పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గానే కాకుండా సొంతంగా బిజినెస్ చేస్తూ సంపాదించిన కోహ్లీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకున్నాడు.

ఇంతకీ విరాట్ ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు. అక్షరాలా 379,294 పౌండ్లను సంపాదించగా ప్రతి పోస్టుకు 126,431 పౌండ్ల ఆదాయాన్ని పొందాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధిక ఆదాయాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు కోహ్లీ.

ఇన్ స్టా ఆదాయంలో విరాట్ ఆరో స్ధానంలో నిలవగా పోర్చుగీస్ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో అగ్రస్ధానంలో ఉన్నాడు. రోనాల్డో ఒక్కపోస్టుకు 1.8 మిలియన్ పౌండ్ల ఆదాయం పొందాడు. మొత్తంగా లాక్ డన్ సమయంలో కూడా ఆదాయాన్ని సమకూర్చుకున్న విరాట్‌ ఔరా అనిపించాడు.

- Advertisement -