కోహ్లీ గోల్డెన్ డక్‌ @ 4

639
kohli
- Advertisement -

కింగ్ స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్…రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేస్తోంది. భారత బౌలర్ల ధాటికి 37 పరుగులకే 2 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది విండీస్‌.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులు చేయగా సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కొల్పోయి 168 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే కోహ్లి పెవిలియన్‌ చేరాడు.

ఓవరాల్‌గా టెస్టుల్లో గోల్డెన్‌ డక్‌ కావడం కోహ్లికి ఇది నాలుగోసారి. మొత్తం తొమ్మిదిసార్లు టెస్టుల్లో కోహ్లి డకౌట్‌ అయ్యాడు.

- Advertisement -