ధోని రిటైర్మెంట్…కోహ్లీ,వీవీఎస్ ఎమోషనల్!

217
kohli
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు ధోని రిటైర్మెంట్‌పై స్పందించారు. దేశం కోసం నువ్వు అందించిన సేవ ప్రతీ ఒక్కరి హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని కోహ్లీ ట్వీట్ చేశాడు. నీ నుంచి నాకు దక్కిన పరస్పర గౌరవం నాతో ఎప్పటికీ ఉంటుందని, ప్రపంచం నువ్వు అందుకున్న విజయాలను చూస్తుందని చెప్పుకొచ్చాడు విరాట్‌.

ధోనీ ఓ లెజెండ్ అని, తన స్టైల్లోనే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడని అశ్విన్ చెప్పాడు. ఎప్పట్లాగే తన స్టైల్లోనే లెజెండ్ రిటైరయ్యాడు. ధోనీ భాయ్, నువ్వు దేశం కోసం చేయాల్సిందంతా చేశావ్….నువ్వందించిన విజయాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో సజీవంగా ఉంటాయని పేర్కొన్నాడు. ధోని జర్నీ అనన్య సామాన్యం అని తెలిపాడు వీవీఎస్ లక్ష్మణ్.

భారత క్రీడా రంగానికి ధోని ఎనలేని సేవలు అందించాడంటూ ఎన్‌సీపీ చీఫ్ శరద్‌ పవార్ కొనియాడారు. భారత క్రీడారంగానికి ధోని అందించిన సేవలు, నెలకొల్పిన రికార్డులు ప్రత్యేకమైనవనీ… యువతకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నాడు.

ధోనీలాంటి మరో ఆటగాడు దొరకడం అసంభవమని సెహ్వాగ్ చెప్పాడు. ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారుగానీ ధోనీకంటే ప్రశాంతంగా ఉండేవాళ్లు ఎవరూ లేరు..ఓం ఫినిషాయ నమః అని పేర్కొన్నాడు.

- Advertisement -