పెళ్ళికి ముందే తమన్నాతో విరాట్‌ డేటింగ్‌..?

209
virat kohli dating with thamanna
- Advertisement -

రీసెంట్ గా బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శ‌ర్మను క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ లవ్వాడి పెళ్ళిచేసుకున్న విషయం తెలిసిందే. అయితే అనుష్క కంటే ముందే మరో ఇద్దరు బ్యూటీలతో విరాట్‌ డేటింగ్‌ చేశాడనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌కి వెళ్లిన త‌మ‌న్నా, బ్రెజిలియ‌న్ సుంద‌రి ఇస‌బెల్ లేతే లతో విరాట్‌ డేటింగ్‌ చేసినట్టు టాక్‌.

 virat kohli dating with thamanna

ఓ మొబైల్ కంపెనీ ప్ర‌క‌ట‌న‌లో త‌మ‌న్నా, విరాట్‌ క‌లిసి నటించారు. అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య కుదిరిన స్నేహం, డేటింగ్ వ‌ర‌కు వ‌చ్చింద‌ని, వీరిద్ద‌రూ సంవ‌త్స‌రం పాటు డేటింగ్ చేశారని తెలుస్తోంది. అయితే 2013లో బ్రెజిలియ‌న్ సుంద‌రి ఇస‌బెల్ లేతే ఎంటర్ అవడంతో.. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ట‌.

 virat kohli dating with thamanna

ఇక ఓ వ్యాపార‌వేత్త నిర్వ‌హించిన వేడుక‌లో విరాట్‌, ఇస‌బెల్‌ను క‌లిశాడు. ఆమె ఒక బాలీవుడ్ సినిమాలో కూడా న‌టించింది. త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచిన‌ట్లు, ఇద్ద‌రూ క‌లిసి సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు కూడా వెళ్లినట్లు అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి.

కానీ వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ఆ త‌ర్వాత విరాట్‌, అనుష్క రూపంలో తన లేడీ ల‌వ్‌ను క‌లిశాడు. మొత్తానికి అనుష్క శర్మతో లవ్‌ ని కంటిన్యూ చేసిన విరాట్‌.. ఎలాంటి హడావిడీ లేకుండా అనుష్కను పెళ్ళిచేసుకొని ఒక్కసారిగా అందరికీ షాకిచ్చాడు.

- Advertisement -